విశాఖలో ఘోర క్రేన్ ప్రమాదం...10 మంది మరణించారు దిగ్భ్రాంతి లో ఆంధ్రప్రజాలు... - Telugu Film News - Political news - andhranews - telugunews

breaking news

Post Top Ad

1 ఆగ, 2020

విశాఖలో ఘోర క్రేన్ ప్రమాదం...10 మంది మరణించారు దిగ్భ్రాంతి లో ఆంధ్రప్రజాలు...



క్రేన్ కూలిపోయి పది మంది చనిపోయిన ఘోర దుర్ఘటన విశాఖ  జిల్లాలోని హిందూస్థాన్‌ షిప్‌‌యార్డులో జరిగింది. అసలీ ప్రమాదం ఎలా జరిగిందో కొంత మంది ప్రత్యక్షంగా చూసిన వాళ్లు తెలిపారు. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా అది సరిగా పనిచెయ్యలేదు. అరే ఈ భారీ క్రేన్‌కి ఏమైంది... అని కొంత మంది క్రేన్‌ను తనిఖీ చేయడం ప్రారంభించారు. అంతే... ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. క్రేన్ కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో దాని కింద ఉన్న కార్మికులు... ఎటూ వెళ్లలేకపోయారు. అంత టైమ్ కూడా లేకుండా అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పటికే 10 మంది చనిపోయారని తెలిసింది. గాయపడిన మరికొందర్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.



క్రేన్ బలంగా కుప్పకూలింది కాబట్టి... గాయపడిన వాళ్ల పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందువల్ల మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు. ప్రమాద సమయంలో క్రేన్‌ కింద 20 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. ఈ భారీ క్రేన్‌ను పదేళ్ల కిందట హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొంది. దీని నిర్వహణను ఈమధ్యే పొరుగు సేవల సిబ్బందికి ఇచ్చారు. ఐతే... ఎక్కడ తేడా వచ్చిందో, ఎందుకు అలా జరిగిందో ఇప్పటికైతే ఎవరికీ అంచనా రావట్లేదు. షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఏం జరిగిందో వివరంగా తెలుసుకున్నారు. గాయపడిన వాళ్లకు పూర్తి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం క్రేన్ శకలాల్ని రక్షణ శాఖ ఉద్యోగులు తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం... షిప్‌యార్డులో అందర్నీ విషాదంలో ముంచేసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad

Pages