ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఎన్నో తెలుసా....?తెలిస్తే షాకే... - Telugu Film News - Political news - andhranews - telugunews

breaking news

Post Top Ad

2 ఆగ, 2020

ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఎన్నో తెలుసా....?తెలిస్తే షాకే...

నగ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. సామాన్యుల దగ్గరి నుంచి బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి చాలా మందికి బ్యాంకుల్లో పని ఉంటుంది. చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, డిపాజిట్ చేయడం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ నెల (ఆగస్ట్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆగస్ట్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 8, 22 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే ఆగస్ట్ నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు 2, 9, 16, 23, 30 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు.

రెండో శనివారాలు, ఆదివారాల్లో సెలవులు కాకుండా ఆగస్ట్ నెలలో బ్యాంక్ ఉద్యోగులకు అదనంగా కూడా సెలవు ఉంది. ఆగస్ట్ 1న బక్రీద్ సందర్భంగా బ్యాంకులు క్లోజ్. అలాగే ఆగస్ట్ 11న మంగళవారం శ్రీ‌కృష్ణ జ‌యంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇంకా ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా బ్యాంకులు క్లోజ్‌లోనే ఉంటాయి. ఇక ఆగస్ట్ 22 వినాయక చవితి. ఈరోజు నాలుగో శనివారం. ఆగస్ట్ 30న మొహరం. ఈరోజు ఆదివారం. ఇకపోతే ఆగస్ట 3న రాఖీ పౌర్ణమి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.

ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad

Pages