ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2
లక్షలు మార్క్ దాటాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు
కాగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో కొత్తగా 89
మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్‌తో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,842 మంది చనిపోయారు.
రాష్ట్రంలో వ్యాధి నుంచి 1,20,464 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం
రాష్ట్రంలో 84,654 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో
62,938 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు మొత్తం 23.62 లక్షల మందికి కరోనా
టెస్టులు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
కొత్తగా కర్నూలు జిల్లాలో అన్ని జిల్లాలు కంటే
అత్యధికంగా 1,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా .
తూర్పుగోదావరిలో 1,270
అనంతపురంలో 1,100
చిత్తూరులో 980
నెల్లూరులో 941
విశాఖలో 852
గుంటూరులో 817
కడపలో 596
పశ్చిమగోదావరిలో 548,
విజయనగరంలో 530,
శ్రీకాకుళంలో 449,
కృష్ణాలో 420,
ప్రకాశం జిల్లాలో 337లో కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏయే జిల్లాల్లో ఎంత
మంది మరణించారంటే..
చిత్తూరు జిల్లాలో కరోనాతో మరో 10 మంది చనిపోయారు.
అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 9 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. కడప, ప్రకాశం, తూర్పుగోదావరి
జిల్లాలో ఏడుగురు చొప్పున చనిపోయారు. కృష్ణా జిల్లాలో 6, కర్నూలు, విశాఖ జిల్లాల్లో
ఐదుగురు చొప్పున మృతిచెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి