Acharya motion poster:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. దీనిపై చిరంజీవి అభిమానులకు గాని తెలుగు ఇరు రాష్టా ప్రజలకు ఈసినిమా పై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైరా తర్వాత చిరు నటిస్తున్న సినిమా ఇది. భారత్ అనే నేను సినిమా తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. తాజాగా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర నిర్మాత రామ్ చరణ్ యూనిట్ సభ్యులు. ఇక సినిమా విషయానికి వస్తే అంతా దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ జరుగుతుందని ముందు నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు అదే నిజమని ప్రూవ్ అయిపోయింది. మోషన్ పోస్టర్‌లో కూడా ఎక్కువగా గుడినే హైలైట్ చేస్తూ ఒక ప్రాంతం అంటే ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కధ లాగా ఉంది. ఇందులో కూడా ఓ ఊరి కోసం.. గుడి కోసం పోరాడే నాయకుడిగా నటిస్తున్నాడు చిరంజీవి. అతడి చేతిలో కత్తి.. పారుతున్న నెత్తురు చూస్తుంటే కమర్షియల్ అంశాలకు ఏ మాత్రం ఢోకా లేదని అర్థమైపోతుంది.
ఇందులో దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే లీడర్ పాత్రలో చిరు నటిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈయన సంగీతం అందిస్తున్న భారీ సినిమా ఇదే. మోషన్ పోస్టర్‌లో అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మణిశర్మ. సమ్మర్ 2021లో విడుదల కానుంది ఆచార్య.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి